మా చినప్పుడు ఆదివారాలు మధ్యాన్నాలప్పుడు నిద్రపోయి లేచి 4 ఇంటికి టీవీలో సినిమా వస్తుంటే చూడ్డం అలవాటు . సరిగ్గా అప్పుడే మా అమ్మ ఏ పకోడీలో , బజ్జీలో , చల్లట్లో మరేదో టిఫిన్ చేసి పెట్టడం, అవి తింటూ సరదాగా సాయంత్రం గడపడం రివాజు. సుమారు నేను 5వ క్లాసులో ఉన్నప్పుడు అనుకొంటాను. అలానే ఓ చల్లని ఆదివారం సాయంత్రం మైసూర్ బజ్జీ చేస్తే అది తినగానే నాకో కవిత తన్నుకొంటూ వచ్చేసింది. అదే నా తొలి కవిత అందుకే నా కవితలు సహజంగా మైసూరు బజ్జీలంత మెత్తగానూ, కమ్మగానూ, రుచిగానూ ఉండి అప్పుడప్పుడూ దానికున్న నూనెలాగా జిడ్డుగా కూడా ఉంటూ ఉంటాయి. మైసూరు బజ్జీకి ఆ పేరెలా వచ్చిందని వాకబు చేసాను. మైసూరులో మొదటి సారి వాటిని చేసినందునా, అక్కడ ప్రాచుర్యం పొనినందునా ఆ పేరొచ్చినట్టు తెలిసింది.
భావావేశం తో అలా తొలి కవిత వచ్చింది గానీ దాన్ని గనుకా సీరియస్ గా తీసుకొంటే కొంపలంటేసుకొంటాయి. అది గనుకా ఎవరన్నా ఆచరించాలని చూస్తే వంటల ప్రపంచంలో విప్లవానికీ, ఓ వీనూత్న పోకడకీ నాంది పలికినవాడినౌతాను అనిపిస్తుంది.
ఆ కవిత ఏంటో మీరే చూడండీ.
సో బెల్లం లేని మిఠాయిలనీ అల్లం లేని అల్లప్పచ్చడినీ చెయ్యమనేదిలా ఉంది కదూ...హ హ హ హ ..అదే మరి స్రుజనాత్మకతంటే ..వేసుకోరా పండూ ఇంకో రెండు వీరతాళ్ళు అనేసుకొన్నా నాకు నేనే .. కొంత పెద్దయ్యకా అనిపించేది ఎంతో సిల్లీగా ఎబ్బెట్టుగా ఏంటబ్బా ఇలా రాసేసాను అని.. కానీ కొన్నాళ్ళకి మరేం పర్లేదంటూ నాకు వెన్ను తట్టి ధైర్యమిచ్చే వాళ్ళు టీవీలో కనిపిచ్చారు "అరటిపండు బజ్జీలు" , " పనస గారెలూ", "కాకరకాయ పలావ్" మొదలైనవి చేసి.
హుహ్ ! పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ అన్నారందుకే

" మా ఊరు మైసూరు...అక్కడ బజ్జీలు పాపులరు
మా ఊరు బోంబే...అక్కడ హల్వా చీపే
ఉందామైసూరు బజ్జీలో మైసూరు? ఉందా బొంబే హల్వాలో బోంబే
ఎందుకు అల్లప్పచ్చడి లో అల్లం ? మిఠాయి లో బెల్లం ? "
సో బెల్లం లేని మిఠాయిలనీ అల్లం లేని అల్లప్పచ్చడినీ చెయ్యమనేదిలా ఉంది కదూ...హ హ హ హ ..అదే మరి స్రుజనాత్మకతంటే ..వేసుకోరా పండూ ఇంకో రెండు వీరతాళ్ళు అనేసుకొన్నా నాకు నేనే .. కొంత పెద్దయ్యకా అనిపించేది ఎంతో సిల్లీగా ఎబ్బెట్టుగా ఏంటబ్బా ఇలా రాసేసాను అని.. కానీ కొన్నాళ్ళకి మరేం పర్లేదంటూ నాకు వెన్ను తట్టి ధైర్యమిచ్చే వాళ్ళు టీవీలో కనిపిచ్చారు "అరటిపండు బజ్జీలు" , " పనస గారెలూ", "కాకరకాయ పలావ్" మొదలైనవి చేసి.
హుహ్ ! పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ అన్నారందుకే
No comments:
Post a Comment