img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Tuesday, December 13, 2011

I Love My Pillow... ♥




ఎవరూ చూడని ఒంటరి క్షణం, చిలిపి తలపులు కవ్విస్తే ...
ముంచుకొచ్చిన ప్రేమని మూటకట్టి 
ముద్దుల రూపంలో దాచుకొనే "కిస్సు బ్యాంక్ లాకర్" లా ఉంటుంది


మనసు పాలకడలిలో మేధోమధనం సాగేవేళ...
తలపులతో బరువెక్కిన శిరో మంధరం
చింతల తాకిడికి కిందకి ఒరగకుండా 
ఊతంగా నిలిచే కూర్మరాజంలా ఉంటుంది


నడిఝాము నిద్దరలో ఏ పీడకలో నను వణికిస్తే...
ఉలికిపడ్డ మనసుని వెన్నుతట్టి జోకొట్టి
భయాన్ని చెరిపే నాన్నారి చిరునవ్వులా ఉంటుంది


ఆశల సౌధం పేకమేడలా కూలిన క్షణం...
విసవిసా పరుగెత్తుకొచ్చి మంచమ్మీద కూలబడితే
కన్నీరు పీల్చుకొనే నా దిండు...అక్కున జేర్చుకోనే అమ్మ ఒడిలా ఉంటుంది



- నందు

Friday, December 9, 2011

తొలకరి తుళ్ళింత



వేసంగి నేలని ముద్దాడిన క్షణం
తొలకరి చినుకు
ఆర్భాటంగా చేసే తీపి సంతకం
-ఓ కమ్మటి మట్టి వాసన

ఎన్నో నాళ్ళు వేచిన మనం
కలిసిన రోజు
అమాంతంగా నువ్వల్లే కౌగిలి వల
-ఓ చక్కటి మధుర భావన