img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Sunday, October 30, 2011

ఓ మై డియర్




వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి
కమ్మని నిదురలో కలలు
వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి
సాగర తీరంలో అలలు
వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయ
ఈ చిట్టి జీవితంలో వ్యధలు

పలకరింపుతో పులకరింపజేసి
అనుబంధాలతో అల్లుకొన్న నువ్వు

నేడులన్నీ నిన్నలు చేసి నే
నిను చేరేసరికే కలలా కరిగిపోకు
కాలనికెదురీది ఆవలి తీరం చేరేలొపే
రేవులో ఇసుకపై రాతలా చెరిగిపోకు
నా గమనం గమ్యం నువ్వే అని తెలిసీ
ఈ జీవితానికి తీరని వ్యధలా నిలిచిపోకు

ఓ నేస్తం .. !

పెనవేసుకొన్న బంధానివి
నెమరేసుకొనే ఙ్ఞాపకంగా మిగిలిపోకు

Monday, October 24, 2011

నా తొలి కవిత - ఓ పాకశాస్త్ర ప్రభంజనం

మా చినప్పుడు ఆదివారాలు మధ్యాన్నాలప్పుడు నిద్రపోయి లేచి 4 ఇంటికి టీవీలో సినిమా వస్తుంటే చూడ్డం అలవాటు :). సరిగ్గా అప్పుడే మా అమ్మ ఏ పకోడీలో , బజ్జీలో , చల్లట్లో మరేదో టిఫిన్ చేసి పెట్టడం, అవి తింటూ సరదాగా సాయంత్రం గడపడం రివాజు. సుమారు నేను 5వ క్లాసులో ఉన్నప్పుడు అనుకొంటాను. అలానే ఓ చల్లని ఆదివారం సాయంత్రం మైసూర్ బజ్జీ చేస్తే అది తినగానే నాకో కవిత తన్నుకొంటూ వచ్చేసింది.:D అదే నా తొలి కవిత *-:)అందుకే నా కవితలు సహజంగా మైసూరు బజ్జీలంత మెత్తగానూ, కమ్మగానూ, రుచిగానూ ఉండి అప్పుడప్పుడూ దానికున్న నూనెలాగా జిడ్డుగా కూడా ఉంటూ ఉంటాయి.B-)  మైసూరు బజ్జీకి ఆ పేరెలా వచ్చిందని వాకబు చేసాను.:-? మైసూరులో మొదటి సారి వాటిని చేసినందునా, అక్కడ ప్రాచుర్యం పొనినందునా ఆ పేరొచ్చినట్టు తెలిసింది.L-)

భావావేశం తో అలా తొలి కవిత వచ్చింది గానీ దాన్ని గనుకా సీరియస్ గా తీసుకొంటే కొంపలంటేసుకొంటాయి.@-) అది గనుకా ఎవరన్నా ఆచరించాలని చూస్తే వంటల ప్రపంచంలో విప్లవానికీ, ఓ వీనూత్న పోకడకీ నాంది పలికినవాడినౌతాను అనిపిస్తుంది.



ఆ కవిత ఏంటో మీరే చూడండీ.;)


" మా ఊరు మైసూరు...అక్కడ బజ్జీలు పాపులరు
మా ఊరు బోంబే...అక్కడ హల్వా చీపే
ఉందామైసూరు బజ్జీలో మైసూరు? ఉందా బొంబే హల్వాలో బోంబే
ఎందుకు అల్లప్పచ్చడి లో అల్లం ? మిఠాయి లో బెల్లం ? " 


సో బెల్లం లేని మిఠాయిలనీ అల్లం లేని అల్లప్పచ్చడినీ చెయ్యమనేదిలా ఉంది కదూ...హ హ హ హ :D:D..అదే మరి స్రుజనాత్మకతంటే (*) ..వేసుకోరా పండూ ఇంకో రెండు వీరతాళ్ళు అనేసుకొన్నా నాకు నేనే =P~.. కొంత పెద్దయ్యకా అనిపించేది ఎంతో సిల్లీగా ఎబ్బెట్టుగా ఏంటబ్బా ఇలా రాసేసాను అని..#-o కానీ కొన్నాళ్ళకి మరేం పర్లేదంటూ నాకు వెన్ను తట్టి ధైర్యమిచ్చే వాళ్ళు టీవీలో కనిపిచ్చారు "అరటిపండు బజ్జీలు" , " పనస గారెలూ", "కాకరకాయ పలావ్" మొదలైనవి చేసి.

హుహ్ ! పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ అన్నారందుకే :P




Wednesday, October 19, 2011

నీ మౌనం




నీ మౌనానిది సుందర వదనం
లోకాన్ని వెలివేసి
మన మధ్య గూడుకట్టిన నిశ్శబ్దంలో 
ధ్వనించే నీ శ్వాసలోని వెచ్చదనం,
తలపుల జడివానలో తడిసిన నాకు
నిలకడనిచ్చీ నిబ్బరమిచ్చీ
వేడిమి పంచే నెగడు చందం 

కానీ ,

నీ మౌనానిది మరో ముఖం
అనంతమైన ఊహలప్రవాహాన్ని పక్కకునెట్టి
విశ్వఘోషకు నే దూరంగా మెదిలీ
నీ ఉనికే సర్వస్వంగా ఆరాటపడ్డ క్షణం,
నీ పలుకు తేనె కోసం 
నా మనసు దప్పికగొన్న ఆ క్షణం ..

....నీ మౌనం 
...ఓ అశనిపాతం !

Sunday, October 16, 2011

నా అలివేణి




ఉరుములు నీ మువ్వలై
మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి

పరుగులు నీ గానమై
తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల

తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
మెలికల మందాకిని కులుకుల బృందావని
కనులకు విందీయవే ఆ అందాన్ని

చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ
మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే
ప్రతి పూట దీపావళి

మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెల
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మ్రోగే వేళ
ఆ సందడే ఆనందమై
ప్రేమించు ప్రాణం పాడే వేళ

ఉరుములు నీ మువ్వలై
మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా కల్యాణి

పరుగులు నీ గానమై
తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

నడయాడే నీ పాదం నట వేదమేనంటు
ఈ పుడమే పులకించగా
నీ పెదవే తనకోసం అనువైన కొలువంటు
సంగీతం నిను చేరగా

మా గుండెనే శృతి చేయవా నీ వీణలా
ఈ గాలిలో నీ వేలితో రాగాలు ఎన్నో రేగేవేళా
నీ మేనిలో హరివిల్లులే వర్ణాల వాగై సాగేవేళ

ఉరుములు నీ మువ్వలై
మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి

తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవె మ్మ్..మ్మ్..మ్మ్ 

Tuesday, October 11, 2011

నీతోనే రోజంతా


వేకువఝామున తొలికిరణం నువ్వై తాకినందుకే
ప్రతి ఉదయం కొత్తవెలుగులతో స్వాగతిస్తుంది

అపరాహ్నంలో నీ ఊసు తలపోసినందుకే
నీలాకాశం నీ రూపురేఖలతో నను కవ్విస్తుంది

మలిసంధ్యలో నువ్వు నా మది మీటినందుకే
మనసు కొమ్మపై కొత్త కోయిల ఆలపిస్తుంది

నడిరేయిలో నీ తలపు లీలగా మెదిలినందుకే
నా అధరాలపై చిరుదరహాసం తొంగిచూస్తుంది

ఇలా నీ ద్యాసలోనే సాగిన ప్రతీ రోజూ
వేయి  రంగుల హరివిల్లై మది విరబూస్తుంది

Monday, October 10, 2011

టూ మచ్ "స్వ"భావం


"ఓహ్ మై గాడ్ ఏమైంది ?...  నా షూ లో ఏదో దూరినట్టుందే !........ తేడాగా ఉంది....... సమ్మ్ థింగ్ రాంగ్ "

"నిజంగా దూరిందా లేక నా భ్రమా? " 

ఒక రెండడుగుల వేసాకా గుండె గుభేల్ మంది 

" న్నో!!!! నిజమే !!! ఏదో దూరింది. షిట్ ట్ట్  ఏమయ్యుంటుంది ?? అసలలా ఎలా దూరింది??" 

"ప్చ్చ్ అయ్యో కనీసం షూ విప్పు చూద్దాం అంటే చేతులు ఖాళీ లేవు. అదీ గాక ఈ మంచులో షూ విప్పితే అంతే సంగతులు. Frost bite కి 2 ఇంచ్ సోల్ ఉన్న షూస్  వేసుకొంటేనే చలి ఆగట్లేదు ఇంక విప్పి చూసుకోడమే?  నో వ్వే!!" 

ఇంకో రెండడుగులు వేసాకా 

" ఐనా చూసుకొనేలా ఉందా ఈ వీధి. కారు చీకటి.  ఏదో dim గా ఆకాశం నుంచీ వచ్చే Diffused light లో దారి చూసుకొంటూ మధ్యలో ఏ fox , deer లేదా wolf కంటపడకుండా ఇంటికెళితే అదే పదివేలు" 

ఇంకో రెండడుగులు వేసాకా ఆగిపోయి 

" ఓహ్ గ్గాడ్!! చంపేస్తోందిదేదో !! అటు నుంచీ ఇటు కదిలిందంటే ఖచ్చితంగా ...ఏదో లివింగ్ క్రీచర్ !! ఇదేదో పురుగే "

"దేవుడా ఏవిటీ పరీక్ష?? ఏం దూరిందస్సలూ ?? చ్చా ! Damn it !!"

వడివడిగా ఇంటికెళ్ళాలి అని ఆత్రంగా ఓ రెండడుగులేసాకా

"నేను ఈ వీధికొచ్చిన మరుసటిరోజు పొద్దున్నే ఇంటి వెనకాల ఓ చచ్చిపడున్న చిన్న పాముని చూసాను కదా ! స్కేల్ తో measure చేస్తే 8 cms ఉంది కూడా. కొంపదీసి ఇదీ అలాంటి బాపతు కాదుకదా? నావల్ల కాదు బాబ్బోయ్ !! చిన్నదైనా పెద్దదైనా పాము పామే..కరిస్తే అంతే సంగతులు" 

మనసులో తడబాటుకి తాళంవేసేలా ఉన్నాయి నా అడుగులు. తిన్నగా నడవట్లేదు. ఎటు నడీస్తే, ఎలా పాదం మోపితే ఆ పామో పురుగో చస్తుందో అలా అడుగులేసుకొంటూ వంకర తింకరగా నేలకి షూ నొక్కి పెట్టి నడిచేస్తూ..

ఓ సారి ఆగిపోయి..

 గట్టిగా నేలని ట్యాప్ చేస్తూ "చావు !! చావు !! దొంగ రస్కెల్ నా షూ లో దూరతావా? అస్సలూ..నిన్నిలా కాదు ! చావు !! " అనుకొంటూ ఓ పది సార్లు గట్టిగా నేలని తన్నేసి ..

ఎవడన్నా చూస్తే ఈ చీకట్లో పిచ్చోడనుకో గలనరి తమాయించుకొని..

"అమ్మో నాకేమైనా అయితేనో ??" అన్న ఓ ఫీలింగ్ వల్ల గబగబా నడిచేస్తుంటే ఆలోచనలకి కళ్ళాలు తెగిపోయాయి. ఇంక ఆలొచనలు ఇలా ఉన్నాయి

"హమ్మయ్య ఇల్లొచ్చేస్తోంది ఇంక కనుచూపు మేరలోకొచ్చేసాం...హ్మ్మ్మ్..కానీ.ఒక వేళ ఈ లోపే కరిచిందనుకో ? ఇంటికెళ్ళి చూసుకొనీ, ఈ మంచులో డాక్టర్ దగ్గరకి పరెగెట్టీ, ఏదన్నా చేసేలోపు విషం పాకేస్తే ? చిన్నపామే కాబట్టి ప్రాణానికేం కాకపోయినా.... అమ్మో ! ఓ వేళ నాకాలు కొట్టేస్తే !!.. కాలు లేని నేనా ? ఒక్క కాలుతో నా? " 

"న్నో!!!"  ( ఆ ఎకో సౌండ్ నా చెవుల్లో.... ఆ వీధిలో ....ఆ చీకటి మొత్తంలో రీసౌండ్ ఇచ్చింది) 

ఇల్లు చేరాను. తలుపులు తెసినట్టు లేదు అది. బద్దలుకొట్టినట్టు ఉంది నా ఎంట్రీ  ... 

మోత్తం నా లెదర్ జాకెట్  తీసేసి , గ్లోవ్స్ పీకేసీ, స్నో షూస్ విప్పేసి చూద్దును కదా. సాక్స్ కీ షూస్ కీ మధ్య లో ఓ గులక రాయి....just a small pebble....మొత్తం అంతా చూసా ఏం లేదు...huh !.పేద్ద నిట్టూర్పు తర్వాత..దాన్ని అరచేతులోకి తీసుకొని చూస్తుంటే..అప్పట్లో పొలంలో కోహినూర్ వజ్రం దొరికినప్పుడు కూడా ఆ రైతు అంత ఆనందపడుండడు  అలా మెరిసాయి నా కళ్ళు . పెదాల మీద మందస్మితం మొగ్గ వేసింది....తల మీద ఓ బుజ్జి టెంకిజెల్ల కొట్టేసుకొని....నాలుక్కరుచుకొన్నాను....చావు తప్పితే కన్ను లొట్టపోతుంది. కానీ ఏ లొట్టా సొట్టా లేకుండా సుబ్బరంగా ఉన్నాను. అందుకే ఏడుపూ నవ్వూ ల మిశ్రమం లాంటి ఆ భావనలో ఉక్కిరిబిక్కిరి అయ్యాను.

కంట్లో నలుసూ, చెప్పులో రాయి మనిషిని ఇంత కొద్ది సేపట్లోనే ఎంతలా ఆలోచింపజేస్తాయో  అనిపించింది..ఏకంగా పురుగూ పామూ విషం సెప్టిక్ కాలు తీసేయ్యడం..ఇదీ ఆలోచనల ప్రవాహం తీరు..

"నేను" అనే సరికి ఎంత స్వార్ధం రా  నందూ ! Photobucket  నువ్వు టూ మచ్ రా  అసలూ    టూ టూ మచ్ hihihihih

*************************************************
Story flash back 


పేరు చినీడ్రైవ్ (Cheney Drive). ఓ చిన్న వీధి. వీధికి అటూ ఇటూ బుజ్జి బుజ్జి ఇళ్ళు. చక్కని lawns, నునుపైన landscaping తో slopes , backyard లో Oak trees,  ఇంకా అప్పుడప్పుడూ చెట్లమధ్యనుంచీ బయటకొచ్చే Deers, Hares ఇంకా Badgers. నేను సుమారు 2 yrs ఉన్న homely place  అది. 

చినీ అంటే చీకటి అని మీనింగ్. పేరుకు తగ్గట్టూ సాయంత్రం ఐతే ఒకటే చీకటి. పేరు పెట్టాకా చెకటిగా ఉందో లేక చీకటిగా ఉందని పేరు పెట్టారో తెలీదు. ఒక్క street light కూడా ఉండదు. అమావాస్య రోజైతే ఇంక చెప్పక్కర్లేదు. 

వింటర్ వచ్చిందంటే around సాయంత్రం 4.30 PM చిమ్మచీకటలు కమ్మెసుకొంటాయి. మంచుకప్పేసే ఆ రోజుల్లో ఒకవేళ బయటకెళితే ఎప్పుడెప్పుడు ఇంటికొచ్చి పడతానురా దేవుడా !  అనిపిస్తుంది. వీధి చివరలో ఓ కొండదారుంటుంది క్యాంపస్ కి వెళ్ళాలంటే అదే దారి. మంచు పడ్డరోజుల్లో అందరూ అక్కడ కనీసం ఒక్క సారైనా జారిపడ్డం ఆనవాయితీ. అంత  నునుపైన slope అది. అక్కడే ఓ street light ఉంటుంది చెట్లమధ్యలోకి పడీపడకుండా పడే కూసంత వెలుగులో మొత్తానికి జారి పడకుండా ఎలాగొ నెగ్గుకొచ్చాకా చిట్టచివర్లో ఢమాల్ మన్నాను ఓ సారి.....దొర్లుకొంటూ మొక్కల మధ్యలోకి వెళ్ళిపోయి పడ్డాను. లేచి కాలూ చెయ్యీ సాగదీసుకొని చేతిలో మిల్క్ క్యాన్ మళ్ళీ పట్టుకొని ఎండిపోయిన oak leaves మధ్యనుంచీ లేచి నడక సాగిస్తుంటే ....



(మంచుపడ్డ రోజుల్లో  మా ఇల్లు ,మా వీధి , వీది చివర కొండదారి )