img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Monday, October 10, 2011

టూ మచ్ "స్వ"భావం


"ఓహ్ మై గాడ్ ఏమైంది ?...  నా షూ లో ఏదో దూరినట్టుందే !........ తేడాగా ఉంది....... సమ్మ్ థింగ్ రాంగ్ "

"నిజంగా దూరిందా లేక నా భ్రమా? " 

ఒక రెండడుగుల వేసాకా గుండె గుభేల్ మంది 

" న్నో!!!! నిజమే !!! ఏదో దూరింది. షిట్ ట్ట్  ఏమయ్యుంటుంది ?? అసలలా ఎలా దూరింది??" 

"ప్చ్చ్ అయ్యో కనీసం షూ విప్పు చూద్దాం అంటే చేతులు ఖాళీ లేవు. అదీ గాక ఈ మంచులో షూ విప్పితే అంతే సంగతులు. Frost bite కి 2 ఇంచ్ సోల్ ఉన్న షూస్  వేసుకొంటేనే చలి ఆగట్లేదు ఇంక విప్పి చూసుకోడమే?  నో వ్వే!!" 

ఇంకో రెండడుగులు వేసాకా 

" ఐనా చూసుకొనేలా ఉందా ఈ వీధి. కారు చీకటి.  ఏదో dim గా ఆకాశం నుంచీ వచ్చే Diffused light లో దారి చూసుకొంటూ మధ్యలో ఏ fox , deer లేదా wolf కంటపడకుండా ఇంటికెళితే అదే పదివేలు" 

ఇంకో రెండడుగులు వేసాకా ఆగిపోయి 

" ఓహ్ గ్గాడ్!! చంపేస్తోందిదేదో !! అటు నుంచీ ఇటు కదిలిందంటే ఖచ్చితంగా ...ఏదో లివింగ్ క్రీచర్ !! ఇదేదో పురుగే "

"దేవుడా ఏవిటీ పరీక్ష?? ఏం దూరిందస్సలూ ?? చ్చా ! Damn it !!"

వడివడిగా ఇంటికెళ్ళాలి అని ఆత్రంగా ఓ రెండడుగులేసాకా

"నేను ఈ వీధికొచ్చిన మరుసటిరోజు పొద్దున్నే ఇంటి వెనకాల ఓ చచ్చిపడున్న చిన్న పాముని చూసాను కదా ! స్కేల్ తో measure చేస్తే 8 cms ఉంది కూడా. కొంపదీసి ఇదీ అలాంటి బాపతు కాదుకదా? నావల్ల కాదు బాబ్బోయ్ !! చిన్నదైనా పెద్దదైనా పాము పామే..కరిస్తే అంతే సంగతులు" 

మనసులో తడబాటుకి తాళంవేసేలా ఉన్నాయి నా అడుగులు. తిన్నగా నడవట్లేదు. ఎటు నడీస్తే, ఎలా పాదం మోపితే ఆ పామో పురుగో చస్తుందో అలా అడుగులేసుకొంటూ వంకర తింకరగా నేలకి షూ నొక్కి పెట్టి నడిచేస్తూ..

ఓ సారి ఆగిపోయి..

 గట్టిగా నేలని ట్యాప్ చేస్తూ "చావు !! చావు !! దొంగ రస్కెల్ నా షూ లో దూరతావా? అస్సలూ..నిన్నిలా కాదు ! చావు !! " అనుకొంటూ ఓ పది సార్లు గట్టిగా నేలని తన్నేసి ..

ఎవడన్నా చూస్తే ఈ చీకట్లో పిచ్చోడనుకో గలనరి తమాయించుకొని..

"అమ్మో నాకేమైనా అయితేనో ??" అన్న ఓ ఫీలింగ్ వల్ల గబగబా నడిచేస్తుంటే ఆలోచనలకి కళ్ళాలు తెగిపోయాయి. ఇంక ఆలొచనలు ఇలా ఉన్నాయి

"హమ్మయ్య ఇల్లొచ్చేస్తోంది ఇంక కనుచూపు మేరలోకొచ్చేసాం...హ్మ్మ్మ్..కానీ.ఒక వేళ ఈ లోపే కరిచిందనుకో ? ఇంటికెళ్ళి చూసుకొనీ, ఈ మంచులో డాక్టర్ దగ్గరకి పరెగెట్టీ, ఏదన్నా చేసేలోపు విషం పాకేస్తే ? చిన్నపామే కాబట్టి ప్రాణానికేం కాకపోయినా.... అమ్మో ! ఓ వేళ నాకాలు కొట్టేస్తే !!.. కాలు లేని నేనా ? ఒక్క కాలుతో నా? " 

"న్నో!!!"  ( ఆ ఎకో సౌండ్ నా చెవుల్లో.... ఆ వీధిలో ....ఆ చీకటి మొత్తంలో రీసౌండ్ ఇచ్చింది) 

ఇల్లు చేరాను. తలుపులు తెసినట్టు లేదు అది. బద్దలుకొట్టినట్టు ఉంది నా ఎంట్రీ  ... 

మోత్తం నా లెదర్ జాకెట్  తీసేసి , గ్లోవ్స్ పీకేసీ, స్నో షూస్ విప్పేసి చూద్దును కదా. సాక్స్ కీ షూస్ కీ మధ్య లో ఓ గులక రాయి....just a small pebble....మొత్తం అంతా చూసా ఏం లేదు...huh !.పేద్ద నిట్టూర్పు తర్వాత..దాన్ని అరచేతులోకి తీసుకొని చూస్తుంటే..అప్పట్లో పొలంలో కోహినూర్ వజ్రం దొరికినప్పుడు కూడా ఆ రైతు అంత ఆనందపడుండడు  అలా మెరిసాయి నా కళ్ళు . పెదాల మీద మందస్మితం మొగ్గ వేసింది....తల మీద ఓ బుజ్జి టెంకిజెల్ల కొట్టేసుకొని....నాలుక్కరుచుకొన్నాను....చావు తప్పితే కన్ను లొట్టపోతుంది. కానీ ఏ లొట్టా సొట్టా లేకుండా సుబ్బరంగా ఉన్నాను. అందుకే ఏడుపూ నవ్వూ ల మిశ్రమం లాంటి ఆ భావనలో ఉక్కిరిబిక్కిరి అయ్యాను.

కంట్లో నలుసూ, చెప్పులో రాయి మనిషిని ఇంత కొద్ది సేపట్లోనే ఎంతలా ఆలోచింపజేస్తాయో  అనిపించింది..ఏకంగా పురుగూ పామూ విషం సెప్టిక్ కాలు తీసేయ్యడం..ఇదీ ఆలోచనల ప్రవాహం తీరు..

"నేను" అనే సరికి ఎంత స్వార్ధం రా  నందూ ! Photobucket  నువ్వు టూ మచ్ రా  అసలూ    టూ టూ మచ్ hihihihih

*************************************************
Story flash back 


పేరు చినీడ్రైవ్ (Cheney Drive). ఓ చిన్న వీధి. వీధికి అటూ ఇటూ బుజ్జి బుజ్జి ఇళ్ళు. చక్కని lawns, నునుపైన landscaping తో slopes , backyard లో Oak trees,  ఇంకా అప్పుడప్పుడూ చెట్లమధ్యనుంచీ బయటకొచ్చే Deers, Hares ఇంకా Badgers. నేను సుమారు 2 yrs ఉన్న homely place  అది. 

చినీ అంటే చీకటి అని మీనింగ్. పేరుకు తగ్గట్టూ సాయంత్రం ఐతే ఒకటే చీకటి. పేరు పెట్టాకా చెకటిగా ఉందో లేక చీకటిగా ఉందని పేరు పెట్టారో తెలీదు. ఒక్క street light కూడా ఉండదు. అమావాస్య రోజైతే ఇంక చెప్పక్కర్లేదు. 

వింటర్ వచ్చిందంటే around సాయంత్రం 4.30 PM చిమ్మచీకటలు కమ్మెసుకొంటాయి. మంచుకప్పేసే ఆ రోజుల్లో ఒకవేళ బయటకెళితే ఎప్పుడెప్పుడు ఇంటికొచ్చి పడతానురా దేవుడా !  అనిపిస్తుంది. వీధి చివరలో ఓ కొండదారుంటుంది క్యాంపస్ కి వెళ్ళాలంటే అదే దారి. మంచు పడ్డరోజుల్లో అందరూ అక్కడ కనీసం ఒక్క సారైనా జారిపడ్డం ఆనవాయితీ. అంత  నునుపైన slope అది. అక్కడే ఓ street light ఉంటుంది చెట్లమధ్యలోకి పడీపడకుండా పడే కూసంత వెలుగులో మొత్తానికి జారి పడకుండా ఎలాగొ నెగ్గుకొచ్చాకా చిట్టచివర్లో ఢమాల్ మన్నాను ఓ సారి.....దొర్లుకొంటూ మొక్కల మధ్యలోకి వెళ్ళిపోయి పడ్డాను. లేచి కాలూ చెయ్యీ సాగదీసుకొని చేతిలో మిల్క్ క్యాన్ మళ్ళీ పట్టుకొని ఎండిపోయిన oak leaves మధ్యనుంచీ లేచి నడక సాగిస్తుంటే ....(మంచుపడ్డ రోజుల్లో  మా ఇల్లు ,మా వీధి , వీది చివర కొండదారి )

3 comments:

ramya.upadrasta said...

wow.....bavundandi nandu garu....chala nachindi.....:)

Anonymous said...

నందు ఒక చిన్న రాయికోసం ఇంత భయపడ్డావా.హ హ ! బుడుగు పిడుగు అంటావ్ ? Very funny lolz !!

నందు said...

@ Shreya : lolz :)