img.emoticon { padding: 0; margin: 0; border: 0; }
Showing posts with label సరదాగా. Show all posts
Showing posts with label సరదాగా. Show all posts

Thursday, November 10, 2011

అప్పు పురాణం


జీవితమన్నాకా అప్స్ అండ్ డౌన్స్ సహజం కదండీ. సరిగ్గా మనం డౌన్ లో ఉన్నప్పుడే మనకి అప్స్  అవసరమౌతాయి. అప్స్ అంటే అప్పులన్నమాట.:)


"ఓ ఐదొందలుంటే కొట్టు గురూ పర్సులో బ్యాలెన్స్ నిల్లు"

"ఈనెల ఎంతకీ గడవట్లేదు మాష్టారు ఫస్టెప్పుడొస్తుందో ఏంటో",

 "ఏదీ ఆ వెయ్యి నోటు భలే ఉందే ! ఇలా ఇయ్యి  చూసి మళ్ళీ ఇచ్చేస్తాను" 

 లాంటి మాటలు నెలాఖర్లో వింటూనే ఉంటాం. సరిగ్గా అప్పుడే అప్పులు కావాల్సొస్తాయి. చిన్నదైతే చేబదులంటారు పెద్దదైతే అప్పంటారు. లోనూ , రుణం, అప్పు, అరువు, బదులూ, ఖాతాలో జమా ఇలా ఎన్ని చెప్పినా అన్నీ మన అప్పు పేర్లే .


                       అప్పులేని వాడే అధిక సంపన్నుడన్న పెద్దలే , అప్పు తప్పు కాదని కూడా చెప్పారు.B-) అంతెందుకు " అప్పించు వాడు , వైద్యుడు , నెప్పుడునెడ తెగక పారు యేరును ద్విజుడున్.." అనే సుమతీ శతకం పద్యంలొ బద్దెనగారేమన్నారు ? ఏ జ్వరమో రోగమో వస్తే అవసరపడే వైద్యుడికన్నా , మంచీ చెడ్డకీ ఉపయోగపడే పురోహితుడికన్నా అంతెందుకు నిత్యం అవసరమయ్యే ప్రాణప్రదమైన నీటికంటే కూడా అప్పిచ్చే వాడినే ముందు చెప్పారు. అలా అన్నీ ఉన్న ఊరుకే వెళ్ళమని చెప్పారు కూడా. ఆఖరికి దేవుడైనా శ్రీనివాసుడికీ పెళ్ళికోసం అప్పుచేయక తప్పలేదు అందుకే ఓ పాటలో " ధనలక్ష్మిని రుణ విష్ణువు దయ కోరెనులే" అన్నారు వేటూరి. అంటే ఇహ అప్పెంత గొప్పదో మీరే అర్ధం చేసుకోండి.అలాంటి అప్పు గురించి కొన్ని విషయాలు ఇప్పుడు నేను మీకు చెబ్తానన్నమాట, మీరేమో బుద్ధిగా చేతులు కట్టుకొని శ్రద్దగా వినాలన్నమాట.:D

                   అప్పులో ఓ సుఖముంది. ఫలానా వస్తువో , డబ్బో, మరొకటో మనది కాకపోయినా సరే ఉన్నపళాన మనదైపోయి మనకి పనికొచ్చేస్తుంది. అఫ్కోర్స్ తర్వాత తిరిగిచ్చేయాలనుకోండి, కానీ జీవితంలో అనుకొన్న టైం కి అనుకొన్నవి సమకూరితేనే చాలా పనులౌతాయి. ఆ తరువాత మళ్ళీ అన్నీ ఉన్నా ఆ ఫలనా అవకాశం రాదు కదండీ. సరిగ్గా అలాంటప్పుడే అప్పు గొప్పదనం కనిపిస్తుంది.;;) ఈ కిటుకుని సొమ్ముచోసుకొడానికి వడ్డీలు వసూలు చేస్తూ మన బ్యాంకులున్నాయి.  అందుకే అప్పివ్వని బ్యాంక్ ఉండదు,  జీవితంలో ఎప్పుడోప్పుడు అప్పుతీసుకోని మనిషీ ఉండడు. అప్పువల్లొచ్చే లాభాలు అనంతం. 

                        అసలు ఎవరినైనా ఇట్టే ఆకర్షించే పదాలు కొన్నుంటాయి ఉదాహరణకి " ఫ్రీ". మా దగ్గర ఏదైనా సెమినార్ జరిగిందనుకోండీ దాని ఇన్విటేషన్ నోటీస్ కింద "ఫ్రీ పిజ్జా అండ్ కోక్ పొర్వైడెడ్" అంటేనే సెమినార్ హాల్ హౌస్ ఫుల్ ఔతుంది.:-B పైకెన్ని చెప్పినా లోలోపల అందరూ వోటేసే:x లోకనాయకుడు మన "ఫ్రీ"గారు. ఈయనా మన అప్పారావ్ కి చుట్టమే (అదే లెండీ అప్పుకి). ఇంతలో అప్పు నుంచీ ఫ్రీగా ఫ్రీలోకెళ్ళిపోయానేనంటనుకొంటునారా.. వస్తున్నా ..వస్తున్నా అక్కడికే వస్తున్నా.=; అప్పుకుండే మరో లాభం ఫ్రీ. అదేలాగబ్బా#-o అనుకొంటున్నారా ? అప్పు మరీ పెద్దదనుకోండీ ఎవరూ ఇచ్చేసి మర్చిపోలేరు. అదే చాలా చిన్నదనుకోండి తిరిగిద్దామను మీరనుకొన్నా పుచ్చుకొనే వాళ్ళకే ఇబ్బందిగా అనిపించి "అయ్యో భలే వారే" అంటూ మీరు ఇచ్చినా మొహమాటపడి పుచ్చుకోరు. ఉదాహరణకి ఎదురింటి న్యూస్పేపర్, పక్కింటి పిన్నిగారి చేతి కాఫీ, వీధి చివరన చాకాలాడి ఇంటి దాకా వెళ్ళి రాడానికి సుబ్బారావ్ గారి సైకిలూ ఇలా అన్నమాట. మాకు లాగా ఎపార్టుమెంట్లో ఉంటే ఇలాంటివి మరీ సులువుగా కుదురుతాయి. ఇలాంటివి కావాలంటే "అప్పు కావలెను" అని మెళ్ళో బోర్డేసుకు వెళ్ళక్కర్లేదు,[-X అలా అవే ఆటోమేటిక్ గా సమకూరుతాయి కూసంత లౌక్యముంటే చాలు. ఈ లెక్కన నెలలో ఓ 20 కాఫీలూ, ఓ 30 న్యూస్పేపర్లూ మన ఖాతాలో పడ్డాకా. ఓ 4 సార్లు పక్కింటివారిని అలా ఇంటికి పిలిచి ఏదో మాటల్లో 4 సార్లు కాఫీలిచ్చేసినా~O) మిగతా 16 కాఫీలూ~O)ఏంటన్నమాటా? ఫ్రీ అన్నమాట.:D/ మరి న్యూస్పేపర్సో? ఐనా అవిచ్చినా తీసుకొంటారా ఎవరన్నా. కాపోతే ఒకటి ఏ సస్పెన్స్ స్టోరీకనో, పజిల్ పూర్తి చేయడానికనో స్వాతీ, ఆంధ్రప్రభ , ఆంధ్రభూమి, సితారా లాంటివి ఇంటికి తెచ్చామనుకోండీ ఇహ అంతే సంగతులు తిరిగిచ్చేదే ఉండదు. అందుకే నేను వారపత్రికలని  దత్త పుత్రికలంటాను :). ఒకసారి ఇంటికొచ్చాకా ఇహ మళ్ళీ గాడపదాటవ్ మనతోనే ఉంటాయి =)). సో అండర్ లైన్ చేసుకోవాల్సిన పాయింటేంటంటే. "అల్పమైన అప్పు అప్పన్నంబు" :-?


                ఇప్పుడు అప్పారావ్ గారి మరో మిత్రుడి గురించి చూద్దాం. ఆయన పేరే Mr.పరపతి. మీరప్పు తీసుకొంటే మీ పరపతి ఆటోమేటిగ్గా పెరిగిపోతూనే ఉంటుంది. ఎంత పెద్ద అప్పో అంత పెద్ద పరపతన్నమాట రెండూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అదెలాగంటే.. మీకు చాలా పెద్ద అప్పుందనుకోండీ దానర్ధమేంటీ? అంటే ఎవరో మీకు అంత అప్పిచ్చారన్నమాట. అంటే  ? మీరు దాన్ని తీర్చగల స్తోమతున్న వారని అర్ధమన్నమాట ! మన బిగ్ బీ కౌన్ బనెగా కరోడ్పతీ చేయకముందు ఎన్నో కోట్ల అప్పులున్నాయంట. అంటే చాలా పరపతి గలవ్యక్తి అప్పటికే. అలాంటి పరపతి ఉందిగాబట్టే ఆ షో హిట్టై అప్పులన్నీ తీర్చేసి పరపతి తగ్గించేసుకొన్నారు పాపం. అంతెందుకు మన నాయుడు గారు వరలడ్ బ్యాంక్ దగ్గర అప్పుంచ్చుకోబట్టే కదా మనది స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యింది.;) సో నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ .. " అప్పు గలవాడే అధిక పలుకుబడి గలవాడు"

                        "నిత్తిమీద రూపాయి పెడితే పావలాకి కోరగావ్ వెధవకనా"X( అని చిన్నప్పుడు తిట్లు గుర్తున్నాయా? నాకున్నాయి. నన్ను అలా మా ఇంట్లో తిట్టారు గానీ  పెద్దలెవరూ నా నెత్తిన రూపాయ్ పెట్టే సాహసం మటుకూ చేయలేదు.=)) పెడితే రూపాయ్ తో బాటూ నేనూ మాయమైపోతానని బాగా తెలిసుంటుంది.=)) ఎంతలేదన్నా ఎవరి రూపాయ్ వాళ్ళకి తీపి. ఆ తీపే అప్పు విషయంలో మనకి శ్రీరామక్షగా నిలుస్తుంది. అదెలాగంటారా.. అప్పుచ్చుకొంటే  మన ఉనికీ, మన బాగోగులు ఓ మనిషి వేయి కళ్ళతో కనిపెడుతున్నారన్న భరోసా ఉంటుంది. అప్పుతీర్చేదాకైనా మనని చల్లగా చూసుకొనే మహానుభావుడొకరుంటారు, ఆ వ్యక్తే మనకి అప్పిచ్చిన వ్యక్తి. అసలు ఇది ఉచితంగా వచ్చే జెడ్ గ్రేడ్ సెక్యూరిటీ లాంటిది ఈ ఫెసిలిటీలో ఉన్న ఆనందమే వేరు :D/.దానితో వచ్చే దర్జా ఠీవీ ఆ డాబు ఇంకదేనితో వస్తాయి చెప్పండీ.

                  కాపోతే ఇక్కడ అమెరికా**==లో "క్రెడిట్ హిస్టరీ" లేదా "అరువు చరిత్ర" అని ప్రతీ మనిషికీ ఓ రికార్డ్ ఉంటుంది. దాన్ని బట్టి ఆ ఫలానా వ్యక్తికెంతప్పివ్వచ్చో నిర్ణయిస్తారు. నిజమండీ బాబూ ! ఇలాంటివి కూడా ఉన్నాయి. ఏదో నోట్లో వేలేసుకొని వింటున్నారు కదా అని నేను తోచింది చెప్పేస్తున్నానని :-@ అనుకొంటే మీరు పప్స్ లో కాలేసినట్టే.b-( కొంచం సులువుగా చెప్పాలంటే ఇది నెత్తినున్న రూపాయ్ ని చూసి పావలా అప్పివ్వడం లాంటిది. ఎన్నో సార్లు ఠంచనుగా అప్పు తీర్చేస్తే బ్యాంకు వాళ్ళకి మీపై నమ్మకం కాస్తా పాపం పెరిగినట్టూ పెరిగిపోయి, మీ క్రెడిట్ స్కోర్ చుక్కల్లోకి దూసుకెళిపోతుంది. అప్పుడు మీరెళ్ళి వైట్ హౌస్ నీ , లిబర్టీ స్టాచ్చూ నీ కొనడానికి అప్పడిగినా ఇట్టే ఇచ్చేస్తారు.:D:D సో పరపతికి కోలమానాలున్నాయి ఈ లోకంలో. మనదేశంలో ఈ పద్ధతి రాడానికి ఇంకా టైం పట్టచ్చులెండి. వచ్చాకా చార్మినారూ, తాజ్మహలూ కొనేసుకొందురుగాని. ఏదేమైనా ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి "అప్పు మీ ఇంటి పైకప్పు లాంటిది" మీకు బోలెడు రక్షణనిస్తుంది.

చూసారా 'అప్పూ'డే ఎన్ని విషయాలు చెప్పేసానో.$-)  సో అవండీ అప్పు లాభాలు.

ఇంక ఉన్నాయి కానీ మరీ అన్నప్రాశన నాడే ఆవకాయొద్దులెండి.:P ఇప్పటికివి చాలు

ఇంతకీ ఇలా అప్పుగొప్పలు డప్పుకొట్టి మరీ ఎందుకు చెప్పానంటే. పొద్దున్నే లేచి చూద్దునుకదా దంతదావనానికి టూత్ పేస్ట్ అయిపోయింది. @-) అలాగే కాఫీలోకి పంచదారా, షూస్ కి పాలిష్హూ, రాసుకోడానికి పెన్నూ. అన్నీ వెనువెంటనే అప్పుచేసి అలా నెట్టుకొచ్చా.;) అసలు మనమంతా నిమిత్త మాత్రులం, మనదంతా రుణరుణానుబంధమే కదా అని ఫిలాసఫీ అలోచిస్తూ అలోచిస్తూ చిస్తూ చిస్తూ తూ.I-|I-|.ఇలా అప్పురాణం చెప్పేసా


                                    ఆఖరుగా మీకో రహస్య మంత్రం చెప్పాలి. పరిస్తితి చేయిదాటిపొయి చేసినప్పు తీర్చలేకపోతేనో ? అప్పుడెలా? అనే అనుమానం  మీకు  ఈ బాటికే రావాలి. వచ్చిందా?..హా వచ్చే ఉంటుంది..దానికొక మంత్రం ఉంది. అలాంటప్పుడు అప్పిచ్చినతన్ని పిలిచి... పక్కన కూర్చోబెట్టుకొని... సావకాశంగా.... చెవులో.... మెల్లిగా " ఐ పీ" అని చెప్పండి ;). చాలు అతను అర్ధం చేసుకొంటాడు. అదో తారకమంత్రం అంతే ! అదేంటో కూడా మీకనవసరం. అది చెప్పడంతో మీ పనైపోతుంది (మీ పని ఐ పోతుంది =))).. అయినా చెబ్తాను ఈ ఎడిష్నల్ పాయింట్.  ఐ పీ అంటే మరేం లేదు "ఇవ్వను పో" (Ivvanu Po) అని :D

చూసారా అప్పుడే ఎన్ని నేర్చేసుకొన్నారో *-:).

సో మీరు కూడా ఎంచెక్కా కావాల్సినవి అప్పడగండి. ఎవరన్నా ఇవ్వనంటే "వడ్డీ" తో కొడతానని X( చెప్పండి. దెబ్బకిచ్చేయాల్సిందే ఎవరన్నా.... ఎంచెక్కా  లైఫ్ ఎంజాయ్ చేయండి...;) (ఐ పీ మంత్రం మటుకూ మర్చిపోకండి:D )


 Ups Ups Thumbs Ups !!  

Monday, October 10, 2011

టూ మచ్ "స్వ"భావం


"ఓహ్ మై గాడ్ ఏమైంది ?...  నా షూ లో ఏదో దూరినట్టుందే !........ తేడాగా ఉంది....... సమ్మ్ థింగ్ రాంగ్ "

"నిజంగా దూరిందా లేక నా భ్రమా? " 

ఒక రెండడుగుల వేసాకా గుండె గుభేల్ మంది 

" న్నో!!!! నిజమే !!! ఏదో దూరింది. షిట్ ట్ట్  ఏమయ్యుంటుంది ?? అసలలా ఎలా దూరింది??" 

"ప్చ్చ్ అయ్యో కనీసం షూ విప్పు చూద్దాం అంటే చేతులు ఖాళీ లేవు. అదీ గాక ఈ మంచులో షూ విప్పితే అంతే సంగతులు. Frost bite కి 2 ఇంచ్ సోల్ ఉన్న షూస్  వేసుకొంటేనే చలి ఆగట్లేదు ఇంక విప్పి చూసుకోడమే?  నో వ్వే!!" 

ఇంకో రెండడుగులు వేసాకా 

" ఐనా చూసుకొనేలా ఉందా ఈ వీధి. కారు చీకటి.  ఏదో dim గా ఆకాశం నుంచీ వచ్చే Diffused light లో దారి చూసుకొంటూ మధ్యలో ఏ fox , deer లేదా wolf కంటపడకుండా ఇంటికెళితే అదే పదివేలు" 

ఇంకో రెండడుగులు వేసాకా ఆగిపోయి 

" ఓహ్ గ్గాడ్!! చంపేస్తోందిదేదో !! అటు నుంచీ ఇటు కదిలిందంటే ఖచ్చితంగా ...ఏదో లివింగ్ క్రీచర్ !! ఇదేదో పురుగే "

"దేవుడా ఏవిటీ పరీక్ష?? ఏం దూరిందస్సలూ ?? చ్చా ! Damn it !!"

వడివడిగా ఇంటికెళ్ళాలి అని ఆత్రంగా ఓ రెండడుగులేసాకా

"నేను ఈ వీధికొచ్చిన మరుసటిరోజు పొద్దున్నే ఇంటి వెనకాల ఓ చచ్చిపడున్న చిన్న పాముని చూసాను కదా ! స్కేల్ తో measure చేస్తే 8 cms ఉంది కూడా. కొంపదీసి ఇదీ అలాంటి బాపతు కాదుకదా? నావల్ల కాదు బాబ్బోయ్ !! చిన్నదైనా పెద్దదైనా పాము పామే..కరిస్తే అంతే సంగతులు" 

మనసులో తడబాటుకి తాళంవేసేలా ఉన్నాయి నా అడుగులు. తిన్నగా నడవట్లేదు. ఎటు నడీస్తే, ఎలా పాదం మోపితే ఆ పామో పురుగో చస్తుందో అలా అడుగులేసుకొంటూ వంకర తింకరగా నేలకి షూ నొక్కి పెట్టి నడిచేస్తూ..

ఓ సారి ఆగిపోయి..

 గట్టిగా నేలని ట్యాప్ చేస్తూ "చావు !! చావు !! దొంగ రస్కెల్ నా షూ లో దూరతావా? అస్సలూ..నిన్నిలా కాదు ! చావు !! " అనుకొంటూ ఓ పది సార్లు గట్టిగా నేలని తన్నేసి ..

ఎవడన్నా చూస్తే ఈ చీకట్లో పిచ్చోడనుకో గలనరి తమాయించుకొని..

"అమ్మో నాకేమైనా అయితేనో ??" అన్న ఓ ఫీలింగ్ వల్ల గబగబా నడిచేస్తుంటే ఆలోచనలకి కళ్ళాలు తెగిపోయాయి. ఇంక ఆలొచనలు ఇలా ఉన్నాయి

"హమ్మయ్య ఇల్లొచ్చేస్తోంది ఇంక కనుచూపు మేరలోకొచ్చేసాం...హ్మ్మ్మ్..కానీ.ఒక వేళ ఈ లోపే కరిచిందనుకో ? ఇంటికెళ్ళి చూసుకొనీ, ఈ మంచులో డాక్టర్ దగ్గరకి పరెగెట్టీ, ఏదన్నా చేసేలోపు విషం పాకేస్తే ? చిన్నపామే కాబట్టి ప్రాణానికేం కాకపోయినా.... అమ్మో ! ఓ వేళ నాకాలు కొట్టేస్తే !!.. కాలు లేని నేనా ? ఒక్క కాలుతో నా? " 

"న్నో!!!"  ( ఆ ఎకో సౌండ్ నా చెవుల్లో.... ఆ వీధిలో ....ఆ చీకటి మొత్తంలో రీసౌండ్ ఇచ్చింది) 

ఇల్లు చేరాను. తలుపులు తెసినట్టు లేదు అది. బద్దలుకొట్టినట్టు ఉంది నా ఎంట్రీ  ... 

మోత్తం నా లెదర్ జాకెట్  తీసేసి , గ్లోవ్స్ పీకేసీ, స్నో షూస్ విప్పేసి చూద్దును కదా. సాక్స్ కీ షూస్ కీ మధ్య లో ఓ గులక రాయి....just a small pebble....మొత్తం అంతా చూసా ఏం లేదు...huh !.పేద్ద నిట్టూర్పు తర్వాత..దాన్ని అరచేతులోకి తీసుకొని చూస్తుంటే..అప్పట్లో పొలంలో కోహినూర్ వజ్రం దొరికినప్పుడు కూడా ఆ రైతు అంత ఆనందపడుండడు  అలా మెరిసాయి నా కళ్ళు . పెదాల మీద మందస్మితం మొగ్గ వేసింది....తల మీద ఓ బుజ్జి టెంకిజెల్ల కొట్టేసుకొని....నాలుక్కరుచుకొన్నాను....చావు తప్పితే కన్ను లొట్టపోతుంది. కానీ ఏ లొట్టా సొట్టా లేకుండా సుబ్బరంగా ఉన్నాను. అందుకే ఏడుపూ నవ్వూ ల మిశ్రమం లాంటి ఆ భావనలో ఉక్కిరిబిక్కిరి అయ్యాను.

కంట్లో నలుసూ, చెప్పులో రాయి మనిషిని ఇంత కొద్ది సేపట్లోనే ఎంతలా ఆలోచింపజేస్తాయో  అనిపించింది..ఏకంగా పురుగూ పామూ విషం సెప్టిక్ కాలు తీసేయ్యడం..ఇదీ ఆలోచనల ప్రవాహం తీరు..

"నేను" అనే సరికి ఎంత స్వార్ధం రా  నందూ ! Photobucket  నువ్వు టూ మచ్ రా  అసలూ    టూ టూ మచ్ hihihihih

*************************************************
Story flash back 


పేరు చినీడ్రైవ్ (Cheney Drive). ఓ చిన్న వీధి. వీధికి అటూ ఇటూ బుజ్జి బుజ్జి ఇళ్ళు. చక్కని lawns, నునుపైన landscaping తో slopes , backyard లో Oak trees,  ఇంకా అప్పుడప్పుడూ చెట్లమధ్యనుంచీ బయటకొచ్చే Deers, Hares ఇంకా Badgers. నేను సుమారు 2 yrs ఉన్న homely place  అది. 

చినీ అంటే చీకటి అని మీనింగ్. పేరుకు తగ్గట్టూ సాయంత్రం ఐతే ఒకటే చీకటి. పేరు పెట్టాకా చెకటిగా ఉందో లేక చీకటిగా ఉందని పేరు పెట్టారో తెలీదు. ఒక్క street light కూడా ఉండదు. అమావాస్య రోజైతే ఇంక చెప్పక్కర్లేదు. 

వింటర్ వచ్చిందంటే around సాయంత్రం 4.30 PM చిమ్మచీకటలు కమ్మెసుకొంటాయి. మంచుకప్పేసే ఆ రోజుల్లో ఒకవేళ బయటకెళితే ఎప్పుడెప్పుడు ఇంటికొచ్చి పడతానురా దేవుడా !  అనిపిస్తుంది. వీధి చివరలో ఓ కొండదారుంటుంది క్యాంపస్ కి వెళ్ళాలంటే అదే దారి. మంచు పడ్డరోజుల్లో అందరూ అక్కడ కనీసం ఒక్క సారైనా జారిపడ్డం ఆనవాయితీ. అంత  నునుపైన slope అది. అక్కడే ఓ street light ఉంటుంది చెట్లమధ్యలోకి పడీపడకుండా పడే కూసంత వెలుగులో మొత్తానికి జారి పడకుండా ఎలాగొ నెగ్గుకొచ్చాకా చిట్టచివర్లో ఢమాల్ మన్నాను ఓ సారి.....దొర్లుకొంటూ మొక్కల మధ్యలోకి వెళ్ళిపోయి పడ్డాను. లేచి కాలూ చెయ్యీ సాగదీసుకొని చేతిలో మిల్క్ క్యాన్ మళ్ళీ పట్టుకొని ఎండిపోయిన oak leaves మధ్యనుంచీ లేచి నడక సాగిస్తుంటే ....



(మంచుపడ్డ రోజుల్లో  మా ఇల్లు ,మా వీధి , వీది చివర కొండదారి )