img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Tuesday, December 13, 2011

I Love My Pillow... ♥




ఎవరూ చూడని ఒంటరి క్షణం, చిలిపి తలపులు కవ్విస్తే ...
ముంచుకొచ్చిన ప్రేమని మూటకట్టి 
ముద్దుల రూపంలో దాచుకొనే "కిస్సు బ్యాంక్ లాకర్" లా ఉంటుంది


మనసు పాలకడలిలో మేధోమధనం సాగేవేళ...
తలపులతో బరువెక్కిన శిరో మంధరం
చింతల తాకిడికి కిందకి ఒరగకుండా 
ఊతంగా నిలిచే కూర్మరాజంలా ఉంటుంది


నడిఝాము నిద్దరలో ఏ పీడకలో నను వణికిస్తే...
ఉలికిపడ్డ మనసుని వెన్నుతట్టి జోకొట్టి
భయాన్ని చెరిపే నాన్నారి చిరునవ్వులా ఉంటుంది


ఆశల సౌధం పేకమేడలా కూలిన క్షణం...
విసవిసా పరుగెత్తుకొచ్చి మంచమ్మీద కూలబడితే
కన్నీరు పీల్చుకొనే నా దిండు...అక్కున జేర్చుకోనే అమ్మ ఒడిలా ఉంటుంది



- నందు

10 comments:

రసజ్ఞ said...

ప్రియమయిన వారిని కొట్టడానికి దెబ్బ తగలని ఒక కర్రలా కూడా పనిచేస్తుంది ;)

Anonymous said...

So very sweet and so very true :)

నందు said...

రసఙ్ఞ గారు: నిజమేనండీ నేనూ అన్నయ్య చిన్నప్పుడు గలేబులు ఊడి చేతికొచ్చేలాగా కొట్టుకొనేవాళ్ళం. కానీ, నాకు అన్నీ తనే అయ్యే దిండుకి దెబ్బతగిలితే తట్టుకోలేక మానేసా :) నెనర్లు !

నందు said...

అఙ్ఞాత గారు : నెనర్లు

శశి కళ said...

నిజమె సుమా....ఇంత వరకు ఆ ఆలొచన రాలెదు.
దిండు కంటె మనకు స్నెహితులు యెవరు?

నందు said...

@శశి కళ గారు: నెనర్లు.. :)

పరుచూరి వంశీ కృష్ణ . said...

బావుంది ..బాగా రాసారు

నందు said...

@వంశీ కృష్ణగారు : నెనర్లు

ramya.upadrasta said...

chala bavundi andi....nenu kuda eppudina edavalsi vasthe dindu addam pettukuni edustha..evariki kanapadadu kada....:P

నందు said...

హెల్లో రమ్య గారూ ఎలా ఉన్నారు ? మీరు ఎందుకండీ ఏడవడం మీరు ఏడిపించే రకం ఏడ్చే రకం కాదు లెండి.. మీ వ్యాఖ్య కి నెనర్లు