img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Tuesday, May 31, 2011

గతించిన వర్తమానం


ఈ విషయం నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ గారు చెప్పారు.


క్రైస్తవుల సమాధులమీద ఓ శిలాఫలకం ఉంటుంది. దాని మీద మనం సహజంగా ఆ సమాధి చేయబడ్డవ్యక్తి పేరూ, అతను పుట్టిన , మరణించిన తేదీలు లాంటివి చూస్తుంటాము. అయితే కొన్నిటి మీద ఓ సందేశం రాసి ఉంటుంది. దాన్నే ఆంగ్లంలో "ఎపీట్యాఫ్" (Epitaph) అంటుంటారు. సహజంగా ఎపిట్యాఫ్ లో ఆ గతించిన వ్యక్తి జీవిత సారాన్ని క్లుప్తంగా సందేశాత్మకంగా రాస్తారు. ఉదాహరణకి ఆ వ్యక్తి బాగా పిసినారి అనుకోండి. " ద మోర్ యు గివ్ ద మోర్ యు రీప్" లాంటివి రాస్తుంటారు. దాత్రుత్వ గుణాలని ఉపదేసించేదిగా ఉంటుందా వాక్యం.


తపాలా బిళ్ళలూ, కరెన్సీ నాణాలూ సేకరించే అలవాటు కొందరికున్నట్టే ఒకతనికి ఇలా సమాధుల మీద రాసున్న ఎపిట్యాఫ్స్ ని చదివి సేకరించే అలవాటుందిట. ఓ సారి అతను స్మశానంలో అలా సమాధుల మధ్యలోంచీ వెళుతూ కనిపించిన ఎపిట్యాఫ్స్ ని చదువుతున్నాట్ట. అప్పుడు ఈ కింది ఎపిట్యాఫ్ కనిపించిందిట


" Remember friend as you walk by
As you are now so once was I
As I am now you will surely be
Prepare thyself to follow me "


"ఓ బాటసారీ గుర్తుంచుకో ఈరోజు నువ్వెక్కడున్నావో నిన్న నేనూ అక్కడ్డే ఉన్నాను, ఈరోజు నేనెక్కడున్నానో రేపు నువ్వూ తప్పక అక్కడికే వస్తావు కాబట్టి జాగ్రత్తగా గమనించి ముందుకు సాగు " అని దానర్ధం.


లెక్క ప్రకారం సదురు ఎపిట్యాఫ్ సేకరించే వ్యక్తికి దీన్ని చదవగానే కినిచిత్ భయమేయాలి. ఎందుకంటే నిన్న నేనూ నీలాగే ఈ తోవనే సాగానూ రేపు నువ్వూ నాలాగే సమాధిలో పడుకొంటావ్ అని ఆ వాక్యం భయపెట్టినట్టుంది కాబట్టి. కానీ ఆలోచించగా గూఢంగా ఓ అంతరార్ధం దాగుందా ? అనిపిస్తుంది..


కాస్త విశాల ద్రుక్పధంతో చూసినప్పుడు " As you are now so once was I " అంటే నేనూ నిన్నటి రోజున నీలాగా బతికిన వాడినే ! "As I am now you will surely be" అంటే ఏరోజుకైనా ఎవరైనా ఇలా ఆరడుగుల నేలకి పరిమితంకావాల్సిందే అని అర్ధమొస్తుంది. ఆఖరి వాక్యం "Prepare thyself to follow me " లో ఎంతో భావముందనిపిస్తుంది.. జీవితం చిన్నది..బ్రతుకున్నన్నాళ్ళూ ఏరోజుకైనా ఇలా ఆరూడుగుల నేలకే పరిమితమౌతానన్న భావనతో బ్రతుకు. అత్యాశలకీ దురాశలకీ పోకు అని.


పరికించి చూస్తే పైకి భయపెట్టేదిలా ఉన్నా మొత్తానికి హితవుచెప్పే సందేశమే ఇది !

2 comments:

Sudha Rani Pantula said...

ఎపిట్యాఫ్ ని సేకరించడం అనే హాబీ కొత్తగా అనిపించినా..అక్కడి సందేశంలో చాలా అర్థం ఉంది. దానిని వివరించి చెప్పక పోతే అందులో భయపెట్టే అంశమే భయపెట్టే అవకాశం ఉంది. మీరు వివరించి చక్కగా చెప్పారు.బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ అన్నమయ్య వివరించిన సత్యం కూడా ఇదే కదా.
ఎంత సంపాదించినా బంగారం తినలేం..ఎంత ఆర్జించినా ఆరడుగుల నేల తప్ప ఏమీ మిగలదని తెలుసుకోగలిగితే ఆ బ్రతుకు ఎంత సార్థకం!!

నందు said...

@ Sudha: నిజమేనండీ! బాగా చెప్పారు మీ ప్రతిస్పందనకి ధన్యవాదాలు